![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -454 లో.... శివన్నారాయణతో కార్తీక్ బయటకు వస్తాడు. కార్ ఆపమని కార్తీక్ తో శివన్నారాయణ చెప్తాడు. కార్ దిగి జరిగిన దానికి మీ అమ్మ ఏమంటుందని శివన్నారాయణ అడుగుతాడు. నేను చెప్తే మీరు నమ్మరని కాంచనకి కార్తీక్ ఫోన్ చేస్తాడు. జరిగింది మర్చిపోయావా అని స్పీకర్ లో పెట్టి మాట్లాడతాడు.
మర్చిపోయేంత చిన్న విషయం కాదు అది.. దీని అంతటికి కారణం మా నాన్న.. ఆయన ముందు చేసిన తప్పుల వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. జ్యోత్స్న మాటలు వింటున్నాడు. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంట్లో నుండి బయటపడు.. అది ఇల్లు కాదు నాగుపాము పడగే.. ఆ ఇంట్లో మా అన్నయ్యని తప్ప నేను ఎవరిని నమ్మలేనని కాంచన అంటుంటే శివన్నారాయణ బాధపడతాడు. ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి దాస్ వస్తాడు. నేను శ్రీశైలం వెళ్తున్నాను చెల్లి ముడుపు ఇస్తానంటే వచ్చానని శ్రీధర్ తో దాస్ అంటాడు. కావేరి ముడుపు తీసుకొని వచ్చి దాస్ కి ఇస్తుంది. ఎందుకు ముడుపు అని కావేరీని అడుగుతాడు శ్రీధర్. శౌర్యకి తమ్ముడు రావాలని అని కావేరి అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు. ఆ కార్తీక్, దీపలకి గనుక కొడుకు పుడితే దీప ప్లేస్ పర్మినెంట్ అవుతుంది.. అలా అవ్వకూడదని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు కాంచన కుటుంబానికి సారీ చెప్పమని సుమిత్రతో దశరథ్ అంటాడు. మమ్మీ చెప్పదని జ్యోత్స్న అంటుంది.
అయితే నా మాట కూడా విను.. నువ్వు కాంచన కుటుంబానికి సారీ చెప్పేవరకు నేను నిన్ను క్షమించలేనని.. నీతో మాట్లాడనని సుమిత్రతో దశరథ్ అంటాడు. మమ్మీ తప్పేముంది.. అంత పెద్ద శిక్ష వేస్తున్నావని జ్యోత్స్న అంటుంది. అదంతా దీప విని బాధపడుతుంది. దీనికి కారణం నువ్వే కదా అని దీపని జ్యోత్స్న లాక్కొని వెళ్లి బయటకు గెంటేస్తుంది. ఎప్పుడు నా భర్త ఇలా మాట్లాడలేదు.. నీ వల్లే ఇదంతా అని దీపపై సుమిత్ర కోప్పడుతుంది. మళ్ళీ దీపని గుమ్మం దగ్గర నుండి గెంటేయ్యబోతుంటే కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |